ధర్మపురి శ్రీనివాస్ కొడుకు.. నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు ఉదయం రెక్కీ నిర్వహించి దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. అయితే దాడికి పాల్పడ్డిన వ్యక్తులు ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్కార్పియో వాహనంతో ఇంటి గేట్లను ధ్వంసం చేసి లోపలికి చొరబడేందుకు ప్రయత్నం చేశారు. సుమారు 20 నిమిషాల పాటు ధర్మపురి సంజయ్ ఇంటి వద్ద హంగామా సృష్టించారు.
Read Also : Stray Dogs Attack: 11 ఏళ్ల బాలుడిని కొరికి చంపిన వీధి కుక్కలు..
అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దుండగులను అడ్డుకున్నారు. దీనిపై సంజయ్ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా సంజయ్ ఇంటిపై దాడి చేశారా.. దీని వెనుక ఎవరైనా ఉన్నారా అని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ తన తండ్రి శ్రీనివాస్ తో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మరుసటి రోజే తను కాంగ్రెస్ లో చేరలేదని.. కేవలం కొడుకునే పార్టీలో చేర్పించినట్లు డీఎస్ చెప్పారు. దీనికితోడు కొంత కాలంగా డీఎస్ తనయులు అరవింద్, సంజయ్ ల మధ్య రాజకీయ వైరం నడుస్తోంది.
Read Also : Nama Nageswara Rao: ఎంపీని పిలవకుండా హైదరాబాద్ లో బీజేపీ కార్యక్రమాలు
అయితే ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిపై దాడికి వెళ్లడం కలకలం రేపుతుంది. ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడికి వెళ్లిన నిందితులును పోలీసులు విచారణ చేస్తున్నారు. దాడిపై పలు కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇప్పటికే ధర్మపురి సంజయ్ ఇంటి వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఎవరైన అనుమానంగా కనిపిస్తే వారిని ఆరా తీస్తున్నారు.
