NTV Telugu Site icon

Polluted Water : మైలారదేవ్‌పల్లిలో కలుషిత జలాల కలకలం.. తీవ్ర అస్వస్థతతో ఇద్దరు మృతి

Polluted Water

Polluted Water

హైదరాబాద్‌లోని మైలారదేవ్ పల్లిలో కలుషిత జలాల కలకలం సృష్టిస్తున్నాయి. ఈ కలుషిత నీరు త్రాగి తీవ్ర అస్వస్థతతో ఇద్దరు మృతి చెందారు. నిన్న ఒకరు, ఇవాళ మరొకరు మృతి చెందగా.. మరో 10 మందికి పైగా అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ మొగల్ కాలనీలో కలుషిత జలాలు వస్తున్నాయంటున్నాయని స్థానికుల ఆరోపిస్తున్నారు. పలువురి అస్వస్థతకు కారణం పొల్యుటెడ్‌ వాటర్ అని స్థానికులు మండిపడుతున్నారు. అయితే.. ఈ రోజు ఆఫ్రీన్ సుల్తానా (22) మృతి చెందగా.. నిన్న మొహ్మద్ ఖైసర్ అనే యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన ఆఫ్రీన్ సుల్తానా కూతురు ఫైజాబేగం(6నెలలు) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Flipkart Big Saving Days sale: బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. 80 శాతం వరకు డిస్కౌంట్‌..!
అస్వస్థతకు గురైన వారు అజహరుద్దీన్ (15), సమ్రీన్ బేగం(35), ఆర్.పీ సింగ్ (42), షహజాది బేగం(30)లు, చిన్నారులు ఇత్తెషాముద్దీన్(2), ఇఖ్రాబేగం(2) అఫ్రీన్ సుల్తానా కుటుంబ సభ్యురాలు అని సమాచారం. అయితే.. మూడు రోజులు ప్రయివేట్ హాస్పిటల్, మూడురోజులు ఉస్మానియా లో చికిత్స అందించామని, కలుషిత నీరు శాంపిల్ ను చూపిస్తూ ఈ నీళ్లు తాగే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ అఫ్రీన్‌ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఫ్రీన్‌ విరోచనాలు, వాంతులతో బాధపడిందని, కాలనీలో ఇంటికొకరు అస్వస్థతకు గురైనవారేనని, మా కాలనీ కష్టాలను ఎవరు పట్టించుకోరని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.