Accident: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. మృతులు ప్రకాశం జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన వేమవరపు మరియమ్(46), కంకణంపాడు గ్రామానికి చెందిన వేమవరపు డేవిడ్ (50)లుగా గుర్తించారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read Also: Uttarpradesh : చేతులు నరికి, కళ్లు పీకి, కత్తితో పొడిచి.. రైల్వే ట్రాక్ పై దారుణ హత్య