NTV Telugu Site icon

Rangareddy Crime: చేపల వేటకు వెళ్లి.. ఇద్దరు మృతి

New Project (1)

New Project (1)

Rangareddy Crime: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాగ్నానదిలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తాండూరు మండలం ఖాజాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన దేవరి మల్లేష్ (28), నర్సింలు(17)లు శనివారం మధ్యాహ్నం ఖాంజాపూర్ గ్రామంలోని కాగ్నానదికి చేపలు పట్టేందుకు వెళ్లారు.

Read Also: Icecream : సీలింగ్ ఫ్యాన్‌తో ఐస్‌క్రీం తయారీ.. మహిళను మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా

చేపలు పట్టే క్రమంలో వాగులోని వలలో చిక్కిప్రమాద వశాత్తు మునిగిపోయారు. అటుగా వెళ్లిన గ్రామస్తులు వాగులో బట్టలు, చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి వద్దకు వెళ్లి చూశారు. ఈ విషయం సాయిపూర్ లో కూడ పుకారు రావడంతో ఆందోళన చెందారు. ఇంటి నుంచి వెళ్లిన మల్లేష్‌, నర్సింలు తిరిగి రాకపోవడంతో కుటుంభీకులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతి చెందిన మల్లేష్, నర్సింలులు తమవారే అని నిర్ధారించారు. విషయాన్ని మున్సిపల్‌ కౌన్సిలర్‌ నీరజాబాల్‌రెడ్డి, తాండూర్‌ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. నదిలో నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Maoist letter: మావోయిస్టు లేఖ కలకలం.. ఎమ్మెల్యేకి బెదిరింపులు