NTV Telugu Site icon

Road Accident: విషాదం.. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లివస్తూ అనంతలోకాలకు..

Kodad Accident

Kodad Accident

Road Accident: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ భార్యాభర్తలు ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఆదివారం అనంతగరి – కోదాడ రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అనంతగిరి మండలంలోని వెంకట్రాపురంలో జరిగిన పుట్టినరోజు వేడుకలకు తిరుమలాయపాలెం మండలం జిల్లేపల్లి గ్రామానికి చెందిన 13 మంది బంధువులు ఓ ఆటో వెళ్లారు. అనంతరం గ్రామానికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో అనంతగిరి మండలంలోని అనురాగ్ కాలేజీ సమీపంలో గోల్ తండా గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్సులో శబరిమలై వెళ్తున్నారు.

Read Also: KA Paul : వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేస్తా

ఈ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఒకరు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతి చెందిన వారిద్దరూ దంపతులే.. చనిపోయిన వారు దువ్వ రమేష్ , దువ్వ రేణుక.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జిల్లాపెళ్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.