విశాఖ వాల్తేరు డివిజన్ కు మరో రెండు వందే భారత్ ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి… విశాఖ-భువనేశ్వర్, విశాఖ- సికింద్రాబాద్ స్టేషన్ ల మధ్య ఈ రెండు కొత్త వందే భారత్ ట్రైన్లు సేవలు అందించనున్నాయి… ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా రెండు ట్రైన్ లను ప్రారంభించారు… వాల్తేరు డివిజన్లో మొదటిసారి జనవరి 2023లో విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైంది.. ప్రయాణికుల నుండి మంచి ఆదరణ లభించడంతో మరో రెండు కొత్త వందే భారత్ ట్రైన్ లను అందుబాటులోకి చేస్తున్నట్టు తెలిపారు రైల్వే అధికారులు..సికింద్రబాద్ లో ఉదయం 5.30 కి బయలుదేరి మధ్యాహ్నం 1.30 కి వైజాగ్ చేరుకుంటుంది.. ఇక మరో వందే భారత్ ట్రైన్ ఉదయం 5:15 గంటలకు భువనేశ్వర్ నుండి బయలుదేరి, ఆ రోజు ఉదయం 11:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రిటర్న్ విశాఖపట్నం నుండి మధ్యాహ్నం 3:30 గంటలకు బయలుదేరి, అదే రోజున రాత్రి 9:30 గంటలకు తిరిగి భువనేశ్వర్‌కు చేరుకుంటుంది.
Maruthi Nagar Subramanyam: హీరోగా రావు రమేష్.. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ఫస్ట్ లుక్ విడుదల..
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను భారతీయ రైల్వేలు 2019లో మొదటిసారిగా వేగవంతమైన ప్రయాణం కోసం రూపొందించిన ప్రోటోటైప్ రైలుగా ప్రవేశపెట్టాయి. అప్పటి నుండి అనేక మెరుగుదలలతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించబడ్డాయి. రైలు వేగవంతమైన త్వరణం మరియు వేగాన్ని కలిగి ఉంది, అందువల్ల రెండు గమ్యస్థానాల మధ్య దూరాన్ని కవర్ చేయడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుంది. ఇది ఎయిర్‌క్రాఫ్ట్ స్టైల్ టాయిలెట్‌లు, యాంబియంట్ లైటింగ్, పర్సనలైజ్డ్ రీడింగ్ లైట్లు, ఆటోమేటిక్ ఇంటర్‌కనెక్టింగ్ డోర్లు, కోచ్‌ల మధ్య సులభంగా కదలడానికి పూర్తిగా సీల్డ్ గ్యాంగ్‌వేలు, ఆటోమేటిక్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ డోర్లు, యూరోపియన్ స్టైల్ సీట్లు, ఆధునిక లగేజ్ రాక్‌లు మరియు మరిన్ని ఉన్నాయి.
Onion Price Hike : హోలీకి ముందే పెరగనున్న ఉల్లి, బంగాళదుంపల ధరలు