NTV Telugu Site icon

MLA Rajasingh : ఎమ్మెల్యేకు మరో రెండు షోకాజ్‌ నోటీసులు

Rajasingh

Rajasingh

గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తాజాగా మంగళహాట్ పోలీసులు మరో రెండు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే.. ట్విట్టర్, ఫేస్ బుక్‌లో వివాదస్పద వ్యాఖ్యలు చేశారని మంగళహాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే.. డిసెంబర్ 6, 1992లో కర సేవకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, బలిదానాలు స్మరిస్తూ పెట్టిన పోస్ట్ ఎక్కడ కూడా వివాదాస్పదం లేదని రాజసింగ్ వెల్లడించారు. అయితే.. లవ్ జిహాద్ శ్రద్ధ మర్డర్ కేసులో ఫేస్ బుక్ లో వైరల్ అవుతున్న మీమ్ కి రాజాసింగ్ సంబంధం లేదని రాజసింగ్ తెలిపారు. పోలీసులు అత్యుత్సహంతో కలరింగ్ ఇచ్చి షోకాజ్ నోటీసులు ఇచ్చారంటున్న రాజాసింగ్ తరపు న్యాయవాది కరుణసాగర్‌ వెల్లడించారు. రేపటి లోగా షోకాజ్ నోటీసులకు పూర్తి స్థాయి లిఖిత పూర్వక వివరణ ఇస్తామని రాజాసింగ్ లాయర్‌ కరుణసాగర్‌ పేర్కొన్నారు.
Also Read : Space Balloon Flight: వికారాబాద్‌ పంటపొలాల్లో ఆకాశం నుంచి పడిన వింత పరికరం.. ఎగబడ్డ జనం..

తమ రిప్లైకి సంతృప్తి చెందిక పోతే హైకోర్టు ను ఆశ్రయిస్తమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల క్రితం జైలు నుంచి షరతులతో కూడిన బెయిల్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్‌ విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. బెయిల్‌ ఇచ్చే సమయంలో కోర్టు.. రాజాసింగ్‌ సోషల్‌ మీడియాలో ఎలాంటి వివాదస్పద పోస్టులు పెట్టకూడదని పేర్కొంది. దీంతో ఆయన సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.