Site icon NTV Telugu

Pavitra lokesh: పవిత్రా లోకేష్ మనసులో మరో ఇద్దరు హీరోలు.. నరేష్ ఏమైపోతాడు..

Pavithra Lokes

Pavithra Lokes

పవిత్రా లోకేష్.. ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే సీనియర్ నటుడు నరేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమయాణం నడపడమే కాదు..సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’.. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ టాక్ ను అందుకుంటుంది..

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఎక్కడ చూసినా ఈ జంటే కనిపించింది.. కనీసం పబ్లిక్ లో ఎలా ఉండాలో కూడా మరచి రెచ్చిపోయారు.. ఇద్దరూ కలిసి పలు టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు. ఇక నరేష్ ఓ సందర్భంలో.. పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పడం గమనార్హం. ఇక పవిత్రా లోకేష్ తనకు ఇద్దరు హీరోలపై క్రష్ ఉందని స్వయంగా వెల్లడించింది.. ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ఆమె మాట్లాడుతూ.. గీతాంజలి సినిమా లో నాగార్జున నటనను చూసి, ఇలాంటి వాడు భర్తగా రావాలని ఫీలింగ్ ఏర్పడింది. నా ఫస్ట్ క్రష్ నాగార్జునే. అదే సమయంలో ప్రకాష్ రాజ్ కూడా తనకు ఇష్టమని చెప్పింది. ఆయనతో చాలా సినిమాలు నటించానని పవిత్రా లోకేష్ చెప్పుకొచ్చింది. కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు..నరేష్ ఏమైపోతాడో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై నరేష్ ఎలా స్పందిస్తారో చూడాలి..

Exit mobile version