Site icon NTV Telugu

TS News: గొర్రెల కుంభకోణంలో మరో ఇద్దరు ఉద్యోగులు అరెస్ట్..

Sheep Scam

Sheep Scam

గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ అంజిలప్ప, ఏడీ కృష్ణయ్యలను అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ స్కామ్ లో నలుగురు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Mamata Banerjee: మమతకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు

కాగా.. వీరిద్దరూ గుత్తేదారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. రైతుల నుంచి గొర్రెలను ప్రైవేటు వ్యక్తులతో సేకరించారని దర్యాప్తులో గుర్తించారు. ఏపీకి చెందిన రైతులకు ఇవ్వాలసిన 2.10 కోట్లును గుత్తేదారుల ఖాతాల్లో నగదు జమ చేయడానికి సహకరించారని గుర్తించారు. ఈ క్రమంలో వీరిద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసంలో హజరుపరిచారు. దీంతో వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే.. మరో వెటర్నరీ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారిని రేపు విచారించే అవకాశం..? ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: TET Exam: టెట్ నోటిఫికేషన్ విడుదల..

Exit mobile version