Site icon NTV Telugu

Shocking Video : పట్టపగలు మహిళపై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసిన దుండగులు..

Viral

Viral

Shocking Video : ఈ మధ్యకాలంలో చాలా చోట్ల దారుణాలకు ఎగబడుతున్నారు కొందరు దుండగులు. ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై దాడి చేసి వారికి అందినంతగా దోచుకెళ్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మహిళపై ముసుగులో ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం నాడు జరిగిన ఈ ఘటన న్యూయార్క్ లోని మాన్‌ హట్టన్‌ లో జరిగింది.

Varalaxmi Sarathkumar: బాలకృష్ణ దంపతులకు శుభలేఖ ఇచ్చిన వరలక్ష్మి.. పిక్స్ వైరల్!

కేవలం 15 సెకన్లు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ మహిళ రోడ్డు పక్కన హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని నడుస్తూ వెళుతూ ఉంటుంది. అలా వెళ్తున్న ఆమె వెనకాల ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు బేస్ బాల్ బ్యాట్ తో ఆ మహిళను వెంబడించినట్లు కనబడుతుంది. ఆ మహిళ మరింత ముందుకు వెళ్తుండగా మాస్క్ ను ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆకస్మాత్తుగా ఆ మహిళ పై దాడి చేశారు. ఈ దాడిలో ఆమెను కొట్టి బేస్బాల్ బ్యాట్ తో దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. అయితే దుండగులు ఆమె హ్యాండ్ బ్యాగ్ ను లాక్కునేందుకు ప్రయత్నించినప్పటికీ., ఆమె పట్టు విడగొకపోవడంతో దుండగులు ఆమెను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు.

Exit mobile version