Site icon NTV Telugu

Ganja In Hyderabad: జూనియర్ డాక్టర్ల వద్ద గంజాయి.. గంజాయి పెడ్లర్ అరెస్ట్..

Ganja Doctors

Ganja Doctors

Ganja In Hyderabad: హైదరాబాద్ మహానగరంలో మరోసారి గంజాయి గుప్పుమంది. నగరంలోని కోఠిలో ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్ లకు గంజాయి విక్రయిస్తూ ఓ పాత నెరస్తుడిని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సుల్తాన్ బజార్ పోలీసులు రైడ్స్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదివరకే ఆ గంజాయి పెడ్లర్ సురేష్ సింగ్ పై 5 కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు అనగా గురువారం ఉదయం కోఠి లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్లు అయిన డాక్టర్ కె. మణికందన్, డాక్టర్ వి. అరవింద్ లు గంజాయి కొనుగోలు చేస్తుండగా పట్టుబడ్డారు.

Heavy rain: ముంబై, పూణెను ముంచెత్తిన కుండపోత వర్షం.. ప్రజా రవాణా అస్తవ్యస్తం

పట్టుబడిన జూనియర్ డాక్టర్ లు టెస్ట్ లో పాజిటివ్ రావడంతో వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీ లో ఇంకా ఎవరైనా గంజాయి తీసుకుంటున్నారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇక ఆ ఇద్దరి నుండి పోలీసులు 80 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. ఇద్దరు జూనియర్ డాక్టర్ లతో పాటు గంజాయి పెడ్లర్ ను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇందుకు సంబంధిచి పోలీసులు లోతైన విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

CO2 Rising: పెరుగుతున్న ప్రాణాంతక కార్బన్ డయాక్సైడ్ వాయువు..నాసా ఏం చెప్తోంది..?

Exit mobile version