Sri Lanka- Iran: శ్రీలంక నేవీతో సహకారాన్ని బలోపేతం చేసేందుకు రెండు ఇరాన్ యుద్ధనౌకలు – IRINS బుషెహర్, టోన్బా – శుక్రవారం నాడు కొలంబో చేరుకున్నాయి. ఎర్ర సముద్రంలో వర్తక నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వాణిజ్యంలో చేరేందుకు కొలంబో సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ యుద్ధనౌకలు శ్రీలంకకు చేరుకున్నాయి. అయితే, హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
Read Also: YSRCP Rebel MLAs: రెబల్ ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు.. 19న తుది విచారణ..!
అయితే, రెండు ఇరాన్ యుద్ధ నౌకలకు శ్రీలంక నేవీ స్వాగతం పలికింది. బుషెహర్ 107 మీటర్ల ఎత్తు.. ఇందులో 270 మంది సిబ్బంది ఉంటారు.. కాగా, టోన్బా దాదాపు 94 మీటర్లు పొడవు ఉంటుంది.. ఇందులో 250 మంది సిబ్బంది ఉంటారు. యుద్ధనౌకల కమాండింగ్ అధికారులు తమ దేశంలో ఉన్న సమయంలో పశ్చిమ నావికా ప్రాంత కమాండర్- శ్రీలంక నేవీ డైరెక్టర్ జనరల్‌ను కలవనున్నారు. ఇక, ఇరాన్ నౌకల సిబ్బంది శ్రీలంకలోని అనేక పర్యాటక కేంద్రాలను సందర్శించే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధనౌక ఫిబ్రవరి 19న శ్రీలంక నుంచి బయలుదేరుతుంది.