NTV Telugu Site icon

Indigo Flight : రోడ్లపై అయిపోయాయి.. ఇక విమానాల్లో మొదలయ్యాయి

Indigo

Indigo

Indigo Flight : ఇప్పటి వరకు రోడ్లపై వెళ్తున్న మహిళలపై మందుబాబులు వేధింపులకు పాల్పడే వారు. ఇక వారి వేధింపులు విమానాల్లో మొదలుపెట్టారు. ఎయిర్‌ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మరవకముందే మరో విమానంలో ఇలాంటిదే మరొకటి జరిగింది. ఇండిగో విమానంలో ప్రయాణికులు తప్పతాగి రచ్చ రచ్చ చేశారు. ఎయిర్‌ హోస్టెస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా అడ్డొచ్చిన విమాన కెప్టెన్‌పై దాడి చేశారు.

Read Also: Israel Protest : అట్టుడుకుతున్న ఇజ్రాయెల్.. రోడ్లను దిగ్బంధించిన నిరసనకారులు

ఈ ఘటన ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి పట్నా వెళ్లిన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. పీకల దాకా తాగిన ముగ్గురు వ్యక్తులు విమానంలో వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఎయిర్‌ హోస్టెస్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన విమాన కెప్టెన్‌పై దాడి చేశారు. దీంతో వీరి గురించి విమాన సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు. విమానం పట్నా విమానాశ్రయంలో దిగగానే సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్లు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

Read Also: Employees Layoffs : ఇక గోల్డ్ మాన్ వంతు.. 3200ఉద్యోగాలకు కోత

ఇదిలా ఉండగా.. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ప్రయాణికురాలిపై తాగిన మత్తులో ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై టాటాసన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. ఈ ఘటన తనకు, తన సహోద్యోగులకు వ్యక్తిగతంగా తీవ్ర వేదన కలిగించిందన్నారు. ఈ ఘటనపై తాము మరింత వేగంగా స్పందించి ఉంటే బాగుండేదని, కానీ తాము తగిన రీతిలో స్పందించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో ఉన్న శంకర్ మిశ్రా అనే వ్యక్తి తోటి ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఢిల్లీ పోలీసులకు ఆమె తాజాగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చి కలకలం రేపింది.