NTV Telugu Site icon

Fraud: ఇస్రో రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో మోసం.. ఇద్దరు అరెస్ట్

Fraud

Fraud

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) కోసం టెక్నికల్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం ఇస్రో పరీక్ష నిర్వహించింది. అయితే ఇందులో హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మోసం చేసారని వారిని పోలీసులు అరెస్టు చేశారు. పరీక్ష ప్రశ్నలకు సమాధానమివ్వడానికి అన్యాయమైన మార్గాలను ఉపయోగిస్తున్నారని.. వారిని రెండు వేర్వేరు పరీక్షా కేంద్రాల్లో అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

Read Also: Jagadish Reddy : ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఆశవాహులకు సముచిత స్థానం దక్కుతుంది

వీరితో పాటు హర్యానాకు చెందిన మరో నలుగురు వ్యక్తులు కూడా ఈ ఘటనకు సంబంధించి కస్టడీలో ఉన్నారని, వారు పరీక్ష రాశారా హాజరయ్యారా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని అధికారి తెలిపారు. అరెస్టయిన ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేశామని, కోచింగ్ సెంటర్‌లతో సహా ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి తెలిపారు.

Read Also: Ajit Agarkar: ధావన్ కాకా నీకు లేదు చోటు.. అన్ని సర్దుకో ఇక..

అరెస్టయిన అభ్యర్థులు మొబైల్ ఫోన్ కెమెరాలను ఉపయోగించి ప్రశ్నలను చిత్రీకరిస్తున్నారని.. వారి చెవుల్లోని బ్లూటూత్ పరికరాల ఆధారంగా సమాధానాలు ఇచ్చారని పోలీసులు తెలిపారు. హర్యానా నుంచి వచ్చిన అజ్ఞాత కాల్ ద్వారా అందిన సమాచారం మేరకు వీరిద్దరూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. మరోవైపు జాతీయ స్థాయి రిక్రూట్‌మెంట్ పరీక్ష కేరళలో జరుగుతుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 10 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.