Site icon NTV Telugu

Vadodara video: స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం.. రన్నింగ్‌లో పడి పోయిన విద్యార్థులు

Eie

Eie

గుజరాత్‌లోని వడోదరలో దారుణం జరిగింది. ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ అతి వేగంతో దూసుకుపోవడంతో డోర్ ఓపెన్ అయి ఇద్దరు విద్యార్థినులు కిందపడి పోయారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. కానీ డ్రైవర్ మాత్రం ఆపకుండా వెళ్లిపోయాడు. సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థినులకు సపర్యాలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్ద ప్రమాదం తప్పడంతో పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ యాజమాన్యం తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. జూన్ 19న ఈ సంఘటన జరిగింది.

మంజల్‌పూర్ నుంచి స్కూల్ వ్యాన్ వేగంగా వస్తోంది. ఇద్దరు బాలికలు వెనుక తలుపు నుంచి పడిపోయారు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమీపంలోని నివాసితులు వెంటనే బాలికలకు సహాయం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి:Mamata Banerjee: ప్రియాంకా గాంధీ కోసం బరిలోకి దిగనున్న మమతా బెనర్జీ..

Exit mobile version