NTV Telugu Site icon

Chhattisgarh: బీజేపీలో చేరినందుకు.. మాజీ సర్పంచ్‌లను కిడ్నాప్ చేసి చంపిన నక్సల్స్!

Chhattisgarh

Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మాజీ సర్పంచ్‌లను మావోయిస్టులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. జిల్లాలోని నైమెడ్, భైరామ్‌గఢ్ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో మాజీ సర్పంచ్ సుఖ్‌రామ్ అవలం, సుకాలు ఫర్సాలను అనుమానిత మావోయిస్టులు కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మృతులు బీజేపీ కార్యకర్తలని పోలీసు క్యాంపును ఏర్పాటు చేయడంలో వారికి సహాయం చేశారని మావోయిస్టులు ఆరోపించారు.

READ MORE: Sambhal Violence: సంభాల్‌లో శుక్రవారం ప్రార్థనలకు ముందు పోలీసులు హైఅలర్ట్

కడేర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆవలం బీజాపూర్‌లోని శాంతినగర్‌లో నివాసం ఉండేవారు. వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామం ఖాదర్ కు వెళ్లారు. అతను తన వ్యక్తిగత పని కోసం ఖాదర్ నుంచి సమీపంలోని కైక గ్రామానికి వెళ్లి.. తిరిగి ఖదర్‌కు వస్తుండగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సుఖ్‌రామ్‌ను అడవి వైపు తీసుకెళ్లారు. అనంతరం మావోయిస్టులు అతడిని హత్య చేసి, మృతదేహాన్ని కాదర్-కైకా రహదారిపై విసిరారు. ఘటనా స్థలం నుంచి గంగలూరు ఏరియా కమిటీ మావోయిస్టులు జారీ చేసిన కరపత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మరో ఘటనలో మాజీ సర్పంచ్ సుకాలు ఫర్సాను మావోయిస్టులు అనుమానితులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు అధికారులు తెలిపారు. బిర్యాభూమి గ్రామానికి వెళ్లే మార్గంలో మావోయిస్టులు ఫర్సాను కిడ్నాప్ చేశారు. ఫర్సా కుమార్తె తన తండ్రిని విడుదల చేయాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసింది. అయినా కూడా నక్సల్స్ కనికరం చూపకుండా ఫర్సా హతమార్చారు. పోలీసులు మృతదేహాన్ని, మావోయిస్టుల కరపత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫర్సా బీజేపీలో చేరినందుకు చంపేశామని మావోయిస్టులు కరపత్రంలో పేర్కొన్నారు. కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో ఈ సంవత్సరం నక్సలైట్లు కనీసం 55 మందిని చంపినట్లు పోలీసులు తెలిపారు.