Site icon NTV Telugu

Macharla Clashes: మాచర్ల హింసాత్మక ఘటనలపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

Clashes In Macharla

Clashes In Macharla

Macharla Clashes: పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనలపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. జూలకంటి బ్రహ్మారెడ్డి సహా తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. బ్రహ్మారెడ్డి, ఇతరులపై సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా బ్రహ్మారెడ్డిని చేర్చారు.

Fake Liquor : మందుబాబులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో నకిలీ మద్యం..

చల్లా మోహన్ అనే రేషన్ డీలర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్రహ్మారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తమపై బ్రహ్మారెడ్డి, బాబూ ఖాన్‌లు రాడ్లతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని దుండగులు టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వడంతో తామే రాళ్లేశామనే ఉద్దేశంతో బ్రహ్మారెడ్డి తమపై దాడి చేశారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మరో కేసు మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురక కిషోర్ మీద నమోదైంది. పార్టీ కార్యాలయంపై దాడి, కార్ల ధ్వంసం, అపార్టమెంటులో జొరబడి చేసిన విధ్వంసాలపై కేసు నమోదైంది. తురక కిషోర్ సహా 10 మందిపై సెక్షన్లు 323, 448, 143, 147 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ-1గా తురక కిషోర్, ఏ-2గా చల్లా మోహన్ పేరును చేర్చారు. ఎర్రం అన్నపూర్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Exit mobile version