Site icon NTV Telugu

Passengers Fighting: విమానంలో తెగ కొట్టేసుకున్న ప్రయాణికులు.. వైరల్ వీడియో..

Viral Video

Viral Video

తాజాగా ఓ విమానంలో కొందరు ప్రయాణికులను తీవ్రంగా కొట్టారు. తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ‘ఈవా ఎయిర్’ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ నెట్‌వర్క్‌ లలో వైరల్‌గా మారింది. పక్కనే కూర్చున్న ప్రయాణికుడికి దగ్గు రావడంతో ఆ వ్యక్తి తన సీటులోంచి లేచి మరో సీటులో కూర్చున్నాడు. కొంతసేపటికి, ఒక వ్యక్తి వచ్చి, ఇది తన స్థలం అని, అక్కడ నుండి లేవాలని చెప్పాడు. ఇద్దరూ పరస్పరం దాడికి ప్రయత్నించారు.

Also Read: Ola CEO: లింక్డిన్‌పై ఓలా సీఈవో కీలక వ్యాఖ్యలు

ఫ్లైట్ అటెండెంట్లు వారి గొడవను అణిచివేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. విమానంలో ఇంత పెద్ద గొడవ జరగడంతో మిగతా ప్రయాణికులు భయపడ్డారు. ఒక ప్రయాణీకుడు ఈ గొడవకు సంబంధించిన వీడియోను X లో పోస్ట్ చేశాడు. అతని చెప్పిన దాని ప్రకారం., ఇద్దరు ప్రయాణీకులు ఖాళీగా ఉన్న సీటు గురించి గొడవ పడ్డారని తెలిపారు. ఇకపై అలాంటి ప్రయాణికులను విమానంలోకి అనుమతించవద్దని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనల వల్ల ఇతర ప్రయాణీకులకు ప్రమాదకరంగా మారుతున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version