అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.. రాంబిల్లి మండలంలో ఉన్న సముద్రంలో స్నానానికి దిగి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కెరటాల దాటికి కొట్టుకుపోయారు.. కొత్తపేట గ్రామానికి చెందిన పవన్ తేజ, సూర్య తేజ లుగా గుర్తించారు.. సూర్య తేజ మృతదేహం లభ్యం కాగా పవన్ తేజ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.. వీరిద్దరూ విజ్ఞాన్, అనిట్స్ కాలేజ్ లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు.. ఇద్దరు విద్యార్థుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. తీవ్ర విషాదం నెలకొంది.. బీచ్ వద్దకు చేరుకున్న పవన్ తేజ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
READ MORE: Jana Sena: జనసేన తిరుపతి ఇంఛార్జిపై మహిళ ఆరోపణలు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం..
ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్రంలోకి స్నానానికి 12 మంది విద్యార్థులు దిగారు. అందులో.. తుర్ల అర్జున్, బంగా బబ్లు గల్లంతయ్యారు. మిగతా పది మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. కాగా.. గల్లంతైన వారి కోసం మెరైన్, ఎస్ రాయవరం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గజ ఈతగాళ్ళు, స్థానిక మత్స్యకారులు సహకారంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కొరుప్రోలో ఒక వివాహానికి హాజరై ఈరోజు స్నానాల కోసమని రేవుపోలవరం సముద్రతీరానికి వచ్చారు. స్నానానికి సముద్రంలో దిగగా కెరటాలు తాకిడికి గల్లంతయ్యారు.
READ MORE:IMEC: మోడీ-ట్రంప్ భేటీలో కీలకంగా ‘IMEC’ ప్రాజెక్ట్.. చైనాకి ప్రత్యామ్నాయం.. అదానీ కీలక పాత్ర..