Earthquakes: జపాన్‌ తీరానికి సమీపంలో వరుసగా రెండు భూకంపాలు

Earthquakes

Earthquakes

Two earthquakes struck near the Japan coast in quick succession: జపాన్‌ను మరోసారి భూకంపాలు భయపెట్టాయి. జపాన్ తీరానికి సమీపంలో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, గురువారం జపాన్ తీరానికి సమీపంలో 6.5, 5.0 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. కురిల్ దీవుల తీరంలో మధ్యాహ్నం 2:45 గంటలకు 6.5 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించగా, రెండవది కొన్ని నిమిషాల తర్వాత మధ్యాహ్నం 3:07 గంటలకు సంభవించింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు పెట్టారు. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు.

Read Also: Bus Accident: 13 మందిని బలిగొన్న ఫిట్‌నెస్ లేని బస్సు.. బీజేపీ నేతకు చెందినదిగా గుర్తింపు

×
×
Ad

జపాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్‌ పరిధిలో ఉండే దేశాల్లో ఇదీ ఒకటి. బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, పాపువా న్యూగినియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికా- ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్నాయి.