NTV Telugu Site icon

Jammu Kashmir: వైష్ణో దేవి మార్గ్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి.. శిథిలాల కింద మరికొందరు..!

Landslide

Landslide

జమ్మూలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Read Also: Rescue Operations: తెలంగాణ వ్యాప్తంగా 2 వేల మంది కాపాడిన సిబ్బంది

శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం రహదారిపై రాయి పడి కొండచరియలు విరిగిపడిన సంఘటన జరిగిందని శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు సీఈఓ సమాచారం ఇచ్చారు. కాగా.. కొండచరియలు విరిగిపడటంతో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు.. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో శిథిలాల తొలగింపు పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. భక్తులందరూ కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి దూరంగా ఉండాలని, నిర్వాహకుల సూచనలను పాటించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Read Also: Food Supply Through to Drones: డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా.. సిద్ధమవుతున్న సర్కార్..

ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటన ఎలా జరిగిందో కనిపిస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.