School Holidays: 2 రోజుల పాటు స్కూళ్లకు సెలవు.. వారికి మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Holidays: ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు.. పండుగలు ఇలా విద్యా సంస్థలకు భాగానే సెలవులు వచ్చాయి.. మరో సారి తెలంగాణలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు వచ్చాయి.. రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు డిసైడ్ చేసింది ప్రభుత్వం.. ఇంతకీ విషయం ఏంటంటే.. తెలంగాణ వరుసగా వివిధ పోస్టులకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్న విషయం విదితమే కాగా.. త్వరలోనే టీఎస్ టెట్ (TS TET) కూడా జరగనుంది.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లను ఉంచారు అధికారులు.. చాలా మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.. ఈ నెల 15న టెట్ నిర్వహించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా టెట్ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది..
Read Also: US Crime: అమెరికాలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఏపీ విద్యార్థిని మృతి.. నవ్వుతున్న పోలీసులు
Also Read
రెండు పేపర్లుగా అంటే పేపర్ -1, పేపర్ -2గా టెట్ నిర్వహించబోతున్నారు.. ఈ నెల 15వ తేదీన జరగనున్న టెట్‌లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. టెట్ నేపథ్యంలో.. ఎగ్జామ్ సెంటర్స్ పడిన స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.. టెట్ సెంటర్లలో 14వ తేదీన హాఫ్ డే స్కూల్ మాత్రమే నిర్వహించనున్నారు.. ఇక, పరీక్ష జరిగే 15వ తేదీన ఆయా స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గత ఏడాది టెట్ నిర్వహించిన విద్యాశాఖ.. టీఎస్ టెట్-2023 నోటిఫికేషన్ ఆగస్టులో విడుదల చేసింది.. ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది.. 2.83 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, టెట్‌లో అర్హత సాధించినవారికే డీఎస్సీ, గురుకుల లాంటి వివిధ ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించిన పరీక్షలకు అర్హులు కావడంతో.. తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు ఫ్యూచర్ పంతుల్లు. ఇక, ఈ ఏడాది పేపర్-1కి 1,139 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-2 పరీక్ష కోసం 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 92 పరీక్షా కేంద్రాలు, ములుగు జిల్లాలో అత్యల్పంగా 8 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈసారి కూడా టెట్ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదు. పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకం కోసం పేపర్-1 నిర్వహిస్తారు మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత సాధించేందుకు పేపర్-2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. పేపర్-1 పరీక్షలో 1-8 తరగతులకు ప్రామాణిక ప్రశ్నలు మరియు పేపర్-2 పరీక్షలో 6-10 తరగతులకు ప్రామాణిక ప్రశ్నలు ఉంటాయి.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!