NTV Telugu Site icon

Case On Youtuber: యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు..

Police Case

Police Case

Case On Youtuber: తాజాగా యూట్యూబర్ హర్ష హైదరాబాద్ రోడ్లపై డబ్బుల వర్షం కురిపించిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం సంబంధించి యూట్యూబర్ హర్ష పై సైబరాబాద్ పోలీసులు రెండు పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు చేశారు. ఈ విషయం సంబంధించి తాజాగా హర్ష మాట్లాడుతూ.. నన్ను బ్యాడ్ చేయొద్దు.. నేను మంచోడిని అంటూ మరో వీడియో పోస్ట్ చేసారు. తాను లక్షల మందికి హెల్ప్ చేశానని., సహాయాన్ని ఎవరు పట్టించుకోకుండా నన్ను బ్యాడ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. మీడియా ఛానల్స్ నన్ను బ్యాడ్ చేస్తున్న అంటూ ఆగ్రహం చెందాడు. యూట్యూబర్ చేసిన పనిపై ఇప్పటికే హైదరాబాద్ సైబరాబాద్ లో కేసులు నమోదు అయ్యాయి.

KL Rahul Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు కేఎల్ రాహుల్ రిటైర్మెంట్..? ఈ వైరల్ పోస్ట్‌లో నిజమెంత..?

రోడ్డుపై డబ్బులు వెదజల్లి హంగామ చేసిన యూట్యూబర్ పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు చేసారు సైబరాబాద్ పోలీసులు. డబ్బులు విసిరే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబర్ హర్షపై కేసు నమోదు చేసారు. రోడ్లపై డబ్బులు విసిరేస్తూ వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నాడు హర్ష. తాను టెలిగ్రామ్ లో గంటకి వేల రూపాయలు సంపాదిస్తున్నానంటూ.. మీరు కూడా జాయిన్ అవ్వండి అంటూ వీడియోలు పెడుతున్నాడు. హర్షపై సనత్ నగర్ లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు సనత్ నగర్ పోలీసులు. KPHB పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు చేసారు సైబరాబాద్ పోలీసులు.

Raja Saab-Prabhas: సైలెంట్‌గా వస్తాం.. భారీ హిట్ కొడతాం!