ట్విట్టర్ తమ యూజర్లకు షాక్స్ మీద షాకులిస్తోంది. కొత్త రూల్స్ పేరుతో ట్విట్టర్ యూజర్ల నుంచి అందినకాడికి డబ్బులను దండుకోవడానికి చూస్తోంది. ఇటీవలే, బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ పొందాలంటే డబ్బులు చెల్లించాలన్న ట్విట్టర్.. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. బ్లూ టిక్ లేని యూజర్లకు కొత్త ఫీచర్ ఇచ్చినట్టే ఇచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంది. బ్లూ టిక్ లేకుంటే మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు డైరెక్ట్ మెసేజింగ్ ద్వారా మెసేజ్ పంపితే ఛార్జీలు చెల్లించాల్సిందేనంటూ ఎలన్ మస్క్ కొత్త ఫిట్టింగ్ పెట్టాడు.
Read Also: Rains And Floods: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. వణికిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు
వినియోగదారులు పేమెంట్ సర్వీసైన ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందేలా చేసేందుకు, వెరిఫై చేయని అకౌంట్ల కోసం డైరెక్ట్ మెసేజ్‌లపై ఆంక్షలను విధించడానికి ట్విట్టర్ ఈ కొత్త మార్పులు తీసుకొచ్చింది. వెరిఫైడ్ చేయని ట్విట్టర్ యూజర్లకు మెసేజ్ సామర్థ్యాలను పరిమితం చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ అప్‌గ్రేడ్ చేయడంతో పాటు మరింత మెరుగుపరచేలా ప్రోత్సహిస్తోంది.
Read Also: Andhra Pradesh Rains: ఏపీలోని ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక..మరో 3 రోజులు భారీ వర్షాలు..
జూలై 22 నుంచి ట్విట్టర్ యూజర్లు పంపగల డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యపై వెరిఫై చేయని అకౌంట్ల కోసం షరతులు పెట్టింది. అయితే, కంపెనీ ఇంకా నిర్దిష్ట పరిమితులను వెల్లడించలేదు. మరిన్ని మెసేజ్‌లను పంపడానికి యూజర్లు పేమెంట్ సర్వీసు అయిన ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. ఇటీవల, రిసీవర్ ఫాలో చేయని వెరిఫైడ్ యూజర్ల నుంచి మెసేజ్‌లు ప్రత్యేక మెసేజ్ రిక్వెస్ట్ ఇన్ బాక్స్ కి మూవ్ చేసే ఒక ఫీచర్‌ను ట్విట్టర్ రూపొందించింది. ఈ చర్యలతో ట్విట్టర్ వినియోగదారులు కానివారిపై ఆంక్షలను విధిస్తుంది. అయితే, కంపెనీ లాగిన్ చేయని వినియోగదారుల కోసం వెబ్‌లో ట్వీట్‌లు, వ్యాఖ్యలకు యాక్సెస్‌ను పరిమితం చేసింది.
Read Also: Biggest Cemetery : ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక.. ఎక్కడో తెలుసా?
అయితే, బ్లూ టిక్ లేని ట్విట్టర్ వినియోగదారులు తమ స్నేహితులు, ఫాలోవర్లకు డైరెక్ట్ మెసేజ్ పంపితే ఛార్జీలు విధిస్తున్నట్లు తెలిపింది. ట్విట్టర్ తన సబ్‌స్క్రిప్షన్ సర్వీస్, ట్విట్టర్ బ్లూ కోసం సైన్ అప్ చేయడానికి ఎక్కువ మంది యూజర్లను ప్రోత్సహించడానికి ట్విట్టర్ తన ప్లాట్‌ఫారమ్‌లో ఈ కొత్త మార్పులు చేస్తోంది. డైరెక్ట్ మెసేజ్‌లలో స్పామ్‌ను తగ్గించే ప్రయత్నంలో భాగంగా వెరిఫై చేయని అకౌంట్ల నుంచి పంపే మెసేజ్‌ల సంఖ్యపై కంపెనీ త్వరలో రోజువారీ పరిమితులను విధించనుంది. ట్విట్టర్‌లో మీ ప్రొఫైల్‌కు బ్లూ టిక్ లేకపోతే.. మీరు ప్లాట్‌ఫారమ్‌లో అన్‌లిమిటెడ్ డైరెక్ట్ మెసేజ్‌లను పంపలేరని గుర్తు పెట్టుకోవాలి.