Site icon NTV Telugu

Twitter: భారత్‌లోనూ ట్విటర్ ఉద్యోగులకు షాక్‌.. తొలగింపు ప్రారంభం

Twitter

Twitter

Twitter: ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ ప్రక్షాళన చర్యలు చేపడుతున్నాడు. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్‌తో ట్విట్టర్ ను సొంత చేసుకున్న ప్రపంచ కుబేరుడు..ట్విట్టర్‌లో తన మార్క్ చూపిస్తున్నాడు. వచ్చీ రావడంతోనే నలుగురు కీలక ఉద్యోగులతో పాటు ట్విట్టర్ బోర్డును రద్దు చేసి తానే ఏకైక డైరెక్టర్‌గా ఉన్నాడు. మరోవైపు సగం మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాడు ఎలాన్ మస్క్. శుక్రవారం నుంచి సంస్థలో పనిచేస్తున్న సగం ఉద్యోగులను పనిలో ఉన్నాడు. ఖర్చును తగ్గించుకునేందుకు ఈ చర్య చేపడుతున్నట్లు చెబుతున్నారు. మొత్తం 7500 మంది ఉద్యోగుల్లో సగం మందిని తొలగించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సంస్థలో ఎవరెవరు ఉంటారనే అనే విషయాన్ని ఈమెయిల్ ద్వారా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్లూటిక్ ఉన్నవారు ఇకపై నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే అని మస్క్ స్పష్టం చేశాడు.

Imran Khan Ex Wives: ఇమ్రాన్‌పై కాల్పుల ఘటనను ఖండించిన మాజీ భార్యలు

ఇదిలా ఉండగా.. గ్లోబల్ జాబ్ కట్‌లో భాగంగా ట్విట్టర్ భారతదేశంలోని ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. మస్క్ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించడానికి భారీ కసరత్తును ప్రారంభించగా.. దీని తర్వాత ఉన్నతాధికారుల వలసలు పెరిగిపోయాయి. భారత్‌లో ఉన్న ట్విటర్‌ ఉద్యోగులను పెద్ద మొత్తంలో తొలగించినట్లు తెలుస్తోంది. భారత్‌లో ఉద్యోగాల కోతకు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే అందుబాటులో లేవు. ఇంజనీర్లు, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్లలో భారత్‌లో భారీగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.

Exit mobile version