Site icon NTV Telugu

Twitter Down: ప్రపంచవ్యాప్తంగా ‘ఎక్స్‌’ సేవలకు అంతరాయం.. టైమ్‌లైన్‌లు ఖాళీ!

X

X

X Down again Across the World: ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఎక్స్‌లో సమస్య తలెత్తింది. ఎక్స్‌ ఖాతాలను తెరవగానే.. టైమ్‌లైన్‌ ఖాళీగా కన్పిస్తోంది. వినియోగదారులకు ట్వీట్లను చూపడం లేదు. ఫాలోయింగ్‌, ఫర్‌ యూ, లిస్ట్‌ పేజీలు కూడా ఖాళీగా కన్పిస్తున్నాయి. ప్రస్తుతం #TwitterDown అని ట్రెండింగ్‌లో ఉంది.

Also Read: Dunki Review: షారుఖాన్ ‘డంకీ’ రివ్యూ!

ఎక్స్‌ ప్రీమియం, ఎక్స్‌ ప్రో వెర్షన్‌లు కూడా పనిచేయడం లేదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఎక్స్‌లో ఈ సమస్య ఇంకా కొనసాగుతోంది. గత రెండు నెలల్లో ఎక్స్‌లో అనేకసార్లు సాంకేతిక సమస్యలు వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 14న ఎక్స్‌లో అవుట్‌గోయింగ్ లింక్‌లు అకస్మాత్తుగా పని చేయడం ఆగిపోయాయి. మార్చి, జూలైలో కూడా ఎక్స్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. సిబ్బంది కొరత, ఇతర సాంకేతిక కారణాల వల్ల ట్విటర్‌ సేవలు ఇలా నిలిచిపోతున్నాయని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Exit mobile version