Yusuf Guda: హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. యూసుఫ్ గూడలోని లక్ష్మీనరసింహనగర్ లో అర్ధరాత్రి హత్య జరిగింది. పాలమూరుకు చెందిన సింగోటం రాము అనే వ్యక్తి మర్మాంగాలతో పాటు గొంతు కోసి అతి కిరాతకంగా మర్డర్ చేశారు. అయితే, రాత్రి 11 గంటల టైంలో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి హత్య చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. సంఘటన స్థలాన్ని డీసీపీకృష్ణ చైతన్య, జూబ్లీ హిల్స్ ఏసీపీ పరిశీలించారు. పాత కక్షల కారణంగా హత్య చేశారా లేక వివాహేతర సంబంధమే కారణమా అని పోలీసులు అనుమానిస్తున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ ‘బ్లాక్ పేపర్’ను దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని మోడీ
అయితే, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కు చెందిన సింగోటం రాము రియల్ ఎస్టేట్ వ్యాపారి. రాజకీయాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొంటారు. పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయా? అనే ఉద్దేశంలోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం బోరబండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ తో సహా ఐదుగురు నిందితులు పోలీసులు ముందు లొంగిపోయారు. వారిని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నారు.
Read Also: Tax Distribution : పన్ను పంపిణీలో కర్ణాటకకు రూ.13 ఇస్తే.. యూపీకి మాత్రం రూ.333 ఎందుకిస్తున్నారు?
ఇక, జూబ్లీ హిల్స్ మర్డర్ కేసులో హనీ ట్రాప్ కోణం వెలుగులోకి వచ్చింది. యువతితో కాల్ చేయించి సింగోటం రామును యూసుఫ్ గూడాకు మణీ గ్యాంగ్ పిలిపించింది. అతడు రాగానే వలపని హత్య చేసింది. అయితే, గత కొంతకాలం నుంచి యువతితో రాముకు పరిచయం ఉంది.. దీంతో రామును దారుణంగా చంపేసి అక్కడి నుంచి మణీ గ్యాంగ్ పారిపోయిందని పోలీసులు తెలిపారు. రాముని చంపి ఫ్లాట్లో పెట్టామని కుటుంబ సభ్యులకు రౌడీ షీటర్స్ సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రాము మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే మణీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.