Site icon NTV Telugu

Hyderbad: అల్వాల్ లో బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్… ఓయో రూంకి తీసుకెళ్ళి..

Girls Missing

Girls Missing

సోషల్ మీడియా కారణంగా జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. పరిచయాలు పెంచుకుని ఆ తర్వాత వంచిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇదేతరహాలో ఇన్స్టా గ్రామ్ లో బాలికలను పరిచయం చేసుకుని.. ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు యువకులు. ఇటీవల అల్వాల్ పరిధిలో ఇద్దరు బాలికలు మిస్ అయిన విషయం తెలిసిందే. తమ కూతుర్లు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికల మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

Also Read:Tamil Nadu: డీలిమిటేషన్‌పై స్టాలిన్ నేతృత్వంలో నేడు దక్షిణాది సీఎంల భేటీ

ఇన్ స్టా గ్రామ్ లో మచ్చ బొల్లారంకి చెందిన ఇద్దరు బాలికలతో పరిచయం పెంచుకున్నారు ఇద్దరు యువకులు. ఆ తర్వాత వారిని ట్రాప్ చేశారు. గత 5 నెలల నుంచి బాలికలతో చాట్ చేస్తున్నారు. పరిచయం ముసుగులో దారుణానికి ఒడిగట్టారు. బాలికలకు మాయమాటలు చెప్పి ఓయో రూం కి తీసుకెళ్ళారు. అక్కడ ఇద్దరు యువకులు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువకులు దమ్మాయిగూడ కు చెందిన ఆకుల సాత్విక్, ఈసీఐఎల్ కి చెందిన కర్నాటి మోహన్ చంద్ గా పోలీసులు గుర్తించారు. ఓయో రూమ్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బాలికలను రక్షించారు. ఓయో లాడ్జి నిర్వహకుడిపైనా కేసు నమోదు చేశారు. బాలికలపై అత్యాచారానికి పాల్పడిన యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version