Site icon NTV Telugu

Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దులో ట్విస్ట్..

Nimisha Priya

Nimisha Priya

ఇవాళ కొన్ని గంటల క్రితం కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్ లో ఉరిశిక్ష రద్దు అంటూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. భారతీయ నర్సు నిమిషా ప్రియకు విధించిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేసినట్లు గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, యెమెన్ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక లిఖిత పూర్వక ధృవీకరణ రాలేదని కూడా ప్రకటనలో స్పష్టం చేశారు. తాజాగా ఈ కేసులో ట్విస్ట్ చేసుకుంది. ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ఉరిశిక్ష రద్దు అంటూ వస్తున్న వార్తలు అవాస్తవేమనని, ఉరిశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

Also Read:Physical Harassment: 9వ క్లాస్‌ విద్యార్థినిపై ప్రిన్సిపాల్‌ లైంగిక దాడి.. గర్భవతి కావడంతో..!

భారత గ్రాండ్‌ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్‌ హబీబ్‌ ఒమర్‌ బిన్‌ హఫీజ్‌ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. ఆ బృందం యెమెన్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపిందని, చర్చలు ఫలించడంతో ఉరిశిక్ష రద్దుకు అధికారులు అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం పేర్కొంది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ శాఖ వర్గాలు దీనిపై స్పందించాయి. నిమిష ప్రియ కేసులో కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం అవాస్తవమని వెల్లడించాయి. దీనిపై తమకు యెమెన్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొన్నాయి. దీంతో మళ్లీ ఈ కేసులో ఉత్కంఠ చోటుచేసుకుంది. నిమిషా ప్రియ కేసు 2018 నుంచి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నిమిషా తన వ్యాపార భాగస్వామిని హత్య చేసి, ఆపై శరీరాన్ని ముక్కలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె మార్చి 2018లో హత్య కేసులో దోషిగా నిర్ధారించింది కోర్టు. 2020లో యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది.

Exit mobile version