NTV Telugu Site icon

Jupiter CNG Scooter: ఇక పెట్రోల్ కష్టాలకు చెక్.. వచ్చేస్తున్న CNG స్కూటర్‌

Jupiter Cng Scooter

Jupiter Cng Scooter

Jupiter CNG Scooter: టీవీఎస్ సంస్థ భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025లో కొత్త సీఎన్‌జీ స్కూటర్‌ గా టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఇది ప్రస్తుతం కేవలం కాన్సెప్ట్ మోడల్‌గా మాత్రమే ప్రదర్శించబడింది. అయినప్పటికీ, ఈ స్కూటర్ ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మకమైన నూతన ఆవిష్కరణగా నిలుస్తోంది. ఈ స్కూటర్ విడుదల తేదీపై ఇంకా కంపెనీ స్పష్టత ఇవ్వకపోయినా దీనికోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. గతంలో బజాజ్ సంస్థ విడుదల చేసిన ఫ్రీడమ్ సీఎన్‌జీ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో మంచి స్పందన రాగా.. ఇప్పుడు టీవీఎస్ జూపిటర్ లాంటి సీఎన్‌జీ స్కూటర్ రాకతో స్కూటర్ విభాగంలో కొత్త పోటీ మొదలైంది.

Also read: Sankranthiki Vasthunam : వెంకీ మామ తగ్గేదేలే.. 24 గంటల బుకింగ్స్ మెంటల్ మాస్!

ఇక ఈ టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్‌లో ఉన్న ప్రత్యేకతలు వినూత్నంగా ఉన్నాయి. 1.4 కిలోగ్రామ్ సీఎన్‌జీ కిట్ ఉండగా ఇది పర్యావరణ హితంగా పని చేస్తుంది. కిలో సీఎన్‌జీకి 84 కిలోమీటర్లు ప్రయాణించగలదు. పెట్రోల్ + సీఎన్‌జీ మోడ్లను కలిపి 226 కిలోమీటర్ల మైలేజ్ అందించగలదని కంపెనీ పేర్కొంది. ఇందులో 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్‌ను ఫ్లోర్ బోర్డ్ మౌంట్‌లో అమర్చారు. ఇక డిజైన్ పరంగా చూస్తే ఇందులో.. పెద్ద స్టోరేజ్, ప్లాస్టిక్ ప్యానెల్ కవర్, ఫిల్లర్ నాజిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉపయోగించారు.

Also read: Australian Open 2025: చరిత్ర సృష్టించే దిశగా జకోవిచ్‌.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పటికీ..!

ఇక పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. 6,000 rpm వద్ద 7.1 bhp శక్తి ఉత్పత్తి చేస్తుంది. అలాగే 5,500 rpm వద్ద 9.4 Nm టార్క్ అందిస్తుంది. గంటకు 80 కిలోమీటర్లు గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. ఇది డిజైన్ పరంగా జూపిటర్ 125 ICE వెర్షన్ డిజైన్ పోలికలతో ఉంది. ఈ స్కూటర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలకు గట్టి పోటీ ఇవ్వగలదు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, సీఎన్‌జీ వాహనాలు కూడా పర్యావరణానికి మేలు చేసే ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సీఎన్‌జీ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉన్నా, సీఎన్‌జీ ధర పెట్రోల్‌కు సమీపంగా ఉండటం, పికప్ తక్కువగా ఉండటం వంటి అంశాలు కొద్దిపాటి ప్రతికూలతలుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ కాన్సెప్ట్ మార్కెట్‌లోకి వచ్చిన తరువాత ఆటోమొబైల్ రంగంలో కొత్త శకం ప్రారంభమవుతుంది. స్మార్ట్, పర్యావరణ హిత స్కూటర్ కావాలని ఆశిస్తున్న వినియోగదారులకు ఇది ఆకర్షణీయ ఎంపికగా నిలుస్తుంది.