Site icon NTV Telugu

TVS Ntorq 150: ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లతో రాబోతున్న టీవీఎస్ ఎన్టోర్క్..!

Tvs Ntorq 150

Tvs Ntorq 150

TVS Ntorq 150: టీవీఎస్ మోటార్స్ అతిపెద్ద ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ICE) మోడల్‌గా ఎన్టోర్క్ 150 ను తీసుకురానుంది. 2018లో ప్రారంభమైన ఎన్టోర్క్ 125 భారత మార్కెట్లో 125cc స్పోర్టీ స్కూటర్లకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ఆ మోడల్ మంచి పనితీరు, సౌకర్యం, వినియోగదారులకు అవసరమైన వాటిని అందించడంతో మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు టీవీఎస్, స్పోర్టీ స్కూటర్ విభాగాన్ని మరింత విస్తరించేందుకు ఎన్టోర్క్ 150ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

Read Also: Cease Fire Violation: మారని పాకిస్థాన్ బుద్ది.. భారత్‌పై మళ్లీ దాడులు?

ప్రస్తుతం టీవీఎస్ కంపెనీ 300cc కంటే తక్కువ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ మోడల్స్ కలిగి లేదు. దీంతో ఎన్టోర్క్ 150 కోసం ప్రత్యేకంగా కొత్త ఇంజన్‌ను అభివృద్ధి చేస్తుందా? లేదా ఖర్చు తగ్గించేందుకు ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తోనే వస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. ఎన్టోర్క్ 150లో స్పోర్టీ డిజైన్ కొనసాగనుంది. తక్కువ వర్షన్ అయిన ఎన్టోర్క్ 125లో లభించిన ఆకర్షణీయ రూపాన్ని ఇది కొనసాగించే అవకాశముంది. దీని ఫీచర్ల పరంగా కూడా టీవీఎస్ మెండుగా ఉండేలా చూస్తోంది. సింగిల్ చానల్ ఏబీఎస్ (ABS) మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఉంటుంది.

Read Also: Indus River: సింధు నదీ జలాలు పాకిస్థాన్‌కు వదులుతారా?

అందిన సమాచారం మేరకు 2025 పండుగ సీజన్‌లో ఎన్టోర్క్ 150 విడుదల అయ్యే అవకాశముంది. అదే సమయంలో టీవీఎస్ కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా విడుదల చేయనుంది. ప్రస్తుతం 150-160cc విభాగంలోని స్కూటర్ల ధరలు సుమారు రూ.1.50 లక్షల ప్రాంతంలో ఉండగా, టీవీఎస్ ఎన్టోర్క్ 150 కూడా అదే ధర శ్రేణిలో ఉండే అవకాశం ఉంది.

Exit mobile version