NTV Telugu Site icon

TVS X Electric Scooter: టీవీఎస్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌పై 140కిమీ ప్రయాణం!

Tvs X Electric Scooter

Tvs X Electric Scooter

TVS X Electric Scooter 2023 Price and Range in Hyderabad: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘టీవీఎస్‌’ మోటార్‌ మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. టీవీఎస్‌ ఎక్స్ (TVS X) పేరుతో ప్రీమియం ఇ-స్కూటర్‌ను బుధవారం లాంచ్ చేసింది. టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విభాగంలో ఇది రెండో మోడల్‌. ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ. 2.49 లక్షలు (బెంగళూరు ఎక్స్‌షోరూం)గా ఉంది. ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభం కాగా.. నవంబర్ నెలలో డెలివరీలు మొదలవుతాయి.

టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్‌ స్కూటర్ 3.8 kWh బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌పై 140 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ 2.6 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళుతుంది. ఈ స్కూటర్ బ్యాటరీ 3 kW ఫాస్ట్‌ ఛార్జర్‌తో గంట వ్యవధిలో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. టీవీఎస్ ఎక్స్ కొనుగోలు సమయంలో 950W పోర్టబుల్‌ ఛార్జర్‌ను రూ. 16,275కే అందిస్తామని కంపెనీ చెప్పింది. 3-KW స్మార్ట్ హోమ్ ఛార్జర్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు.

Also Read: World Cup 2023: ప్రపంచకప్‌ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. భారత్ ప్రత్యర్థులు ఎవరంటే?

టీవీఎస్ ఎక్స్ స్కూటర్‌ భద్రత కోసం నెక్ట్స్‌-జెనరేషన్‌ ఏబీఎస్ కూడా అమర్చారు. ఇందులో స్టెల్త్, ఎక్స్‌ట్రైడ్‌, ఎక్సోనిక్‌ మోడ్స్‌ ఉన్నట్లు టీవీఎస్‌ తెలిపింది. నేవిగేషన్‌ సిస్టం, ఈవీ ఛార్జర్ మ్యాపింగ్ మెకానిజమ్‌, లైవ్‌ వెహికల్‌ లొకేషన్ షేరింగ్‌ వంటి ఫీచర్లు ఈ స్కూటర్‌లో అందుబాటులో ఉన్నాయి. గేమింగ్, బ్రౌజింగ్, లైవ్ వీడియో ఫీచర్‌లను అందించే ప్లే టెక్‌తో ఈ స్కూటర్ వస్తోంది. ఈ స్కూటర్‌ను స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, హెల్మెట్‌తో కనెక్ట్ చేయవచ్చు.

Show comments