NTV Telugu Site icon

TVS Jupiter: అమ్మకాలలో రికార్డ్స్ సృష్టిస్తున్న టీవీఎస్ జూపిటర్

Jupiter

Jupiter

TVS Jupiter: దేశీయ టూవీలర్ తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ సంస్థ భారత మార్కెట్లో బైక్స్, స్కూటర్లను విక్రయిస్తూ ఆటోమొబైల్ మార్కెట్ లో దూసుకెళ్తుంది. ప్రతి ఏడాది ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లతో టీవీఎస్ టూవీలర్స్ వినియోగదారులను ఆశ్చర్య పరిచేలా చేస్తుంటాయి. మరింత ముఖ్యంగా, వీటి ధరలు బడ్జెట్ రేంజ్‌లో ఉండడం మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రముఖ స్కూటర్ మోడల్ జూపిటర్ తాజాగా 70 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ టీవీఎస్ జూపిటర్ 2013 సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ కాగా.. విడుదలైన కొద్ది కాలంలోనే ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందింది. హోండా యాక్టివాకు ప్రత్యామ్నాయంగా మైలేజ్, ధర, డిజైన్ పరంగా ఇది వినియోగదారులను ఆకట్టుకుంది.

Also Read: SA 20: భారీ సిక్సర్ కొట్టిన క్లాసెన్.. బంతిని తీసుకుని పారిపోయిన అభిమాని

మొట్టమొదటి సారి లాంచ్ అయిన తర్వాత కేవలం రెండు సంవత్సరాల్లోనే జూపిటర్ 5 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత ఎక్కడ తగ్గకుండా 2016 నాటికి 10 లక్షల యూనిట్లు, 2017 నాటికి 20 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 నాటికి ఈ స్కూటర్ 50 లక్షల యూనిట్ల సేల్స్‌ను దాటింది. ఇప్పుడు, 2024 నాటికి ఈ స్కూటర్ 70 లక్షల యూనిట్ల విక్రయాలను పూర్తి చేసిందంటే ప్రజలు ఈ స్కూటీని ఎంత ఆదరించారో ఇట్టే అర్ధమవుతుంది.

Also Read: Rishabh Pant: రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైన రిషబ్ పంత్

ఇక జూపిటర్ ధర విషయానికి వస్తే.. రూ. 89,396 నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ధర రూ. 99,805 వరకు ఉంది. ఇక కంపెనీ ప్రకారం లీటర్ పెట్రోలుకు 57.27 కి.మీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. 124.8cc సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.1 లీటర్లుగా ఉంది. ఇక ఈ జూపిటర్ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వాయిస్ అసిస్టెంట్, USB ఛార్జింగ్ సాకెట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి జూపిటర్ సేల్స్ భారత స్కూటర్ విభాగంలో టీవీఎస్ కంపెనీ ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తోంది.

Show comments