NTV Telugu Site icon

TVS Jupiter 125: సరికొత్త స్టైల్, పవర్, పర్ఫార్మన్స్ లతో లాంచ్‌కు సిద్ధమైన కొత్త టీవీఎస్ జూపిటర్ 125..!

Tvs Jupiter 125

Tvs Jupiter 125

TVS Jupiter 125: టీవీఎస్ మోటార్ కంపెనీ భారత మార్కెట్‌లో సూపర్ హిట్ అయినా స్కూటర్ జూపిటర్ 125కి కొత్త మోడల్‌ను అతి త్వరలో తీసుకురానుంది. లాంచ్‌కు ముందు ఈ స్కూటర్‌కు సంబంధించిన ఓ టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, ఈ మోడల్‌లో ముఖ్యమైన డిజైన్ మార్పులు ఉండబోతున్నట్లు కనపడేలా వీడియోలో అర్థమవుతుంది. ఇకపోతే, 2021లో మొదటిసారి లాంచ్ నుంచి ఇప్పటివరకు జూపిటర్ 125కి కేవలం చిన్న మార్పులే వచ్చాయి. అయితే, ఈసారి లాంచ్‌లో గణనీయమైన అప్‌డేట్స్ ఉండే అవకాశం ఉంది.

Read Also: Volkswagen Golf GTI: టెక్నాలజీ, స్పోర్ట్ లుక్, పవర్ ఫుల్ ఇంజిన్‌తో అదరహో.. వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI లాంచ్..!

టీవీఎస్ ఇటీవల జూపిటర్ 110 మోడల్‌కు కొత్త డిజైన్ అందించినట్టే, జూపిటర్ 125 కూడా కొత్త లుక్‌లో రానుందని భావిస్తున్నారు. ప్రధానంగా హెడ్‌ లైట్, టెయిల్ ల్యాంప్ డిజైన్‌ను పూర్తిగా మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే స్కూటర్‌కు కొత్త రంగులు కూడా అందించనున్నారు. ఈ మార్పులు స్కూటర్‌కు కొత్త లుక్‌ ను అందించనున్నాయి. ఈ స్కూటర్ మిగితా మోడళ్లతో పోటీ సమానంగా ఉండేందుకు జూపిటర్ 125లో ఫీచర్ల పరంగా చాలానే అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే డిజిటల్ TFT డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది SmartXonnect ద్వారా కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది. అలాగే LED లైట్లు, ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్ వంటి ఆధునిక ఫీచర్లు జోడించే అవకాశం ఉంది.

Read Also: Shocking Incident: మరీ ఇంత దారుణమా.. డ్రైవర్‌ను జేసీబీకి కట్టేసి చితకబాదిన రౌడీ షీటర్..!

ఇక ప్రస్తుతం జూపిటర్ 125లో 125సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 8 bhp పవర్, 10.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. iGo Assist టెక్నాలజీతో ఈ అవుట్‌ పుట్ 8.44 bhp పవర్, 11.1 Nm టార్క్‌గా పెరుగుతుంది. ఈ ఇంజన్‌ను కొత్త మోడల్‌లో కొనసాగించే అవకాశం ఉంది. ఈ కొత్త మోడల్ ఆధునిక ఫీచర్లతో రాబోతుండటంతో, ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోలిస్తే ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది హోండా ఆక్టీవా 125, హీరో డెస్టినీ 125, యమహా ఫాస్సినో, సుజుకి అచ్చెస్స్ 125 వంటి మోడళ్లకు పోటీగా నిలవనుంది. మొత్తంగా ఈ టీవీఎస్ జూపిటర్ 125కి రాబోతున్న కొత్త లుక్, డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా స్కూటర్ ప్రీమియం లుక్‌కు దగ్గరగా తీసుకెళ్తుందని అంచనా.