Site icon NTV Telugu

E-Schooter: వినియోగదారులకు షాక్.. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ.10 వేలు పెరిగిందోచ్..

Tvs Iqube

Tvs Iqube

E-Schooter: వినియోగం పెరుగుతుండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరుగుతున్నాయి. తమ కస్టమర్లకు లాయల్టీ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తక్కువ ధరకే అందించిన టీవీఎస్‌ మోటార్స్.. ఆ లిమిటెడ్‌ టైం ఆఫర్‌ను టీవీఎస్‌ క్లోజ్‌ చేసింది. ఫేమ్ 2 సబ్సిడీలో సవరణ తర్వాత ఖర్చు భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న టీవీఎస్ మోటార్స్‌.. 2023 మే 20 వరకు టీవీఎస్ ఐక్యూబ్ బుకింగ్స్ చేసిన చేసిన కస్టమర్లు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులయ్యేలా చేసింది. కానీ ఈ ప్రోగ్రామ్ ముగియడంతో టీవీఎస్ ఐక్యూబ్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ల ధరల్ని సవరించింది టీవీఎస్ మోటార్. 2023 మే 20 వరకు టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ.1,16,184 కాగా, ఈ ధరను రూ.1,23,184 కి సవరించింది టీవీఎస్ మోటార్. ఇక టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ధర రూ.1,28,849 కాగా, ఈ ధరను రూ.1,38,289 కి సవరించింది. ఇవి ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధరలు.

Also Read: Manipur Violence: మణిపూర్‌లో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం పొడిగింపు

అంటే టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ.5,000 పెరగగా, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ధర సుమారు రూ.10,000 పెరిగింది. ఇప్పుడు టీవీఎస్ ఐక్యూబ్ బుక్ చేసేవారు ఈమేరకు డబ్బులు ఎక్కువగా చెల్లించాలి. ఫేమ్ 2 సబ్సిడీ రివిజన్ కారణంగా చేసిన సర్దుబాట్లకు అనుగుణంగా ధరల్ని టీవీఎస్‌ కంపెనీ అప్‌డేట్ చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ప్రత్యేకతలు చూస్తే ఇది మిడ్ రేంజ్‌లో లభించే స్కూటర్. ఇందులో 7 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంటుంది. ఫైవ్ వే జాయ్‌స్టిక్, మ్యూజిక్ కంట్రోల్, థీమ్ పర్సనలైజేషన్, ప్రొయాక్టీవ్ నోటిఫికేషన్స్, వెహికిల్ హెల్త్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. నాలుగు కలర్స్‌లో కొనొచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ప్రత్యేకతలు చూస్తే ఇది మిడ్ రేంజ్‌లో లభించే స్కూటర్. ఇందులో 7 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంటుంది. ఫైవ్ వే జాయ్‌స్టిక్, మ్యూజిక్ కంట్రోల్, థీమ్ పర్సనలైజేషన్, ప్రొయాక్టీవ్ నోటిఫికేషన్స్, వెహికిల్ హెల్త్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. నాలుగు కలర్స్‌లో కొనొచ్చు.

Also Read: The Earth: ఇప్పుడైతే భూమిపై 24 గంటలు.. ఒకప్పుడు 19 గంటలు మాత్రమే..

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్‌లో 3.4 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 950వాట్ ఛార్జర్‌తో మూడు గంటల్లో, 650వాట్ ఛార్జర్‌తో నాలుగున్నర గంటల్లో ఛార్జింగ్ చేయొచ్చు. టీవీఎస్ ఐక్యూబ్‌ బేస్‌ వేరియంట్‌లో 5 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్‌ ఉంటుంది. ఇందులో 3.4 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్‌ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. కేంద్ర భారీ మంత్రిత్వ పరిశ్రమల శాఖ ఫేమ్ 2 సబ్సిడీని తగ్గించడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరుగుతున్నాయి. గరిష్ట సబ్సిడీ పరిమితిని 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీ కేడబ్ల్యూహెచ్‌కి రూ.15,000 నుంచి కేడబ్ల్యూహెచ్‌కి రూ.10,000కి తగ్గింది. జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి.

Exit mobile version