టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ బైకులకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. స్టైలిష్ లుక్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బైక్ లవర్స్ కు కంపెనీల బిగ్ షాకిచ్చింది. టీవీఎస్ ఇటీవల విడుదల చేసిన అడ్వెంచర్ మోటార్‌సైకిల్, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ 300 ధరను పెంచింది. ఈ మోటార్‌సైకిల్ బిటిఓ వేరియంట్ ధరను పెంచారు. నివేదికల ప్రకారం, ఈ మోటార్ సైకిల్ ధర రూ. 5,000 వరకు పెరిగింది. ఇది ఒకే ఒక వేరియంట్ కు మాత్రమే. బేస్, టాప్ వేరియంట్ ల ధర మారలేదు.
Also Read:Maa Inti Bangaram: రాజ్ నిడిమోరుతో కలిసి సమంత కొత్త సినిమా పూజ
తయారీదారు ఈ మోటార్ సైకిల్ పై అర్బన్, రెయిన్, టూర్, ర్యాలీ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ABS, ఐదు అంగుళాల TFT డిస్ప్లే, క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించారు. ఈ మోటార్ సైకిల్ 299.1cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 36 PS శక్తిని, 28.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో జత చేశారు. ధరల పెరుగుదల తర్వాత, BTO వేరియంట్ ధర ఇప్పుడు రూ. 2.34 లక్షలు (ఎక్స్-షోరూమ్). బేస్ వేరియంట్ ధర రూ. 1.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.