Site icon NTV Telugu

TVK Vijay: అల్లు అర్జున్‌ మాదిరి.. హీరో విజయ్‌ని అరెస్ట్ చేస్తారా?

Tvk Vijay Karur Stampede

Tvk Vijay Karur Stampede

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, దళపతి విజయ్‌ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో పెను విషాదం చోటుచేసుకుంది. విజయ్‌ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40కి పైగా మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. అనేక మంది స్పృహతప్పి పడిపోయారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులలో పార్టీ కార్యకర్తలతో పాటు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ప్రచార సభలో పరిస్థితి గమనించిన విజయ్‌ తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. అధికారులు అంబులెన్సుల్లో బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం కరూర్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. కరూర్‌ సభకు 10 వేల మందికి అనుమతి ఉండగా.. దాదాపుగా లక్ష మంది హాజరైనట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో జనాలు సభకు రావడంతోనే తొక్కిసలాట జరిగిందని పలువురు అంటున్నారు. విజయ్‌ సభకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రతి ఒక్కరు అయ్యోరామా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: IND vs PAK Final: విజేతకు ట్రోఫీ అందిస్తా.. పీసీబీ చీఫ్ అత్యుత్సాహంపై బీసీసీఐ రియాక్షన్ ఏంటో?

టీవీకే అధినేత విజయ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అభిమానులు, కార్యకర్తల మృతికి కారణమైన విజయ్‌పై కేసు నమోదు చేయాలని, అతడిని అరెస్ట్ చేయాలని పోస్టులు పెడుతున్నారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా.. అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. అలానే ఐపీఎల్ 2025 అనంతరం జరిగిన తొక్కిసలాట కారణంగా ఆర్సీబీ జట్టుపై కూస కేసు ఫైల్ అయింది. అదే మాదిరి విజయ్‌ని కూడా అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి.

Exit mobile version