Site icon NTV Telugu

ISIS Chief Killed : ఐఎస్ఐఎస్ చీఫ్ మృతి.. క్లారిటీ ఇచ్చిన టర్కీ ప్రెసిడెంట్

Isis

Isis

అనుమానిత ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ హుస్సన్ అల్ ఖురాషి సిరియాలో చనిపోయినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ ఇంటిలిజెన్స్ నిర్వహించిన ఆరపరేషన్ లో హతమయ్యినట్లు పేర్కొన్నారు. తీవ్రవాద సంస్థలపై ఎలాంటి వివక్ష లేకుండా టర్కీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఎర్గోగాస్ అన్నారు. 2013లో డేష్/ఐసీస్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన మొదటి దేశాలలో టర్కీ ఒకటిగా నిలిచింది.

Also Read : Shriya saran: మరీ ఇంత అందమా! శ్రియ సోయగాలకు రెప్ప వాల్చడం కష్టమే..

ఇంటిలిజెన్స్ ఏజెంట్లు స్థానిక మిలటరీ పోలీసుల సాయంతో సిరియాలో ఆఫ్రిన్ వాయవ్య ప్రాంతంలో జిండిరెస్ లోని ఒక జోన్ ని మూసివేసి ఈ స్టింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు ఎర్డోగాన్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ ఇస్లామిక్ పాఠశాలగా వినియోగిస్తున్న పాడుపడిన పోలాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. టర్కీ 2020 నుంచి ఉత్తర సిరియాలో దళాలను మోహరించి ఈ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో సిరియన్ సహాయకుల సాయంతో మొత్తం జోన్ లను నియంత్రిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read : MAY 01 : ప్రభుత్వం కొత్త నిబంధనలు.. ఇవాళ్టి నుంచి మీ జేబుకు చిల్లే..?

ఇదిలా ఉండగా.. ఐఎస్ఐఎస్ కి గతంలో ఉన్న చీఫ్ అబూ హసన్ అల్ హషిమీ అల్ ఖురాషి మరణించినట్లు నవంబర్ 30న ప్రకటించింది టర్కీ. అతని స్థానంలోకి ప్రస్తుతం ఐఎసీఐఎస్ చీఫ్ అబూ హుస్సేన్ అల్-ఖురాషీ వచ్చాడు. కాగా.. అమెరికా కూడా ఏప్రిల్ మధ్యలో హెలికాప్టర్ దాడులతో ఒక ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ లో ఐఎస్ఐఎస్ కు చెందిన అబ్ద్-అల్ హదీ మహ్మద్ అల్ హాజీ అలీని హతమర్చినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అంతేగాక 2019లో వాయువ్య సిరియాలో జరిగిన ఆపరేషన్ లో ఐఎస్ఐఎస్ అబూ బాగ్దాదీని చంపినట్లు యూఎస్ ప్రకటించింది. ఆ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఒకప్పుడూ నియంత్రించి తరిమికొట్టినప్పటికీ ఇప్పటికీ సిరియాలో దాడులు చేస్తుండటం గమనార్హం.

Exit mobile version