Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్ మళ్లీ నిండుకుండలా మారింది. డ్యామ్ అధికారులు ఇవాళ గేట్లు ఎత్తనున్నారు. గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుంగభధ్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయి స్టాప్ లాగ్ ఎలిమెంట్ ఏర్పాటు తరువాత డ్యామ్ మళ్లీ నిండడం గమనార్హం. గేటు కొట్టుకుపోయి భారీగా నీరు వృథా అయినా వరుణుడు మళ్లీ కరుణించాడు.
Read Also: AP and Telangana Rains LIVE UPDATES: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్
తుంగభధ్ర డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు.. ప్రస్తుతం నీటి మట్టం 1630 అడుగులు నిండుకుండలా ఉంది. ఇన్ ఫ్లో 42, 142 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 10,067 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 94.552 టీఎంసీలుగా ఉంది. గతంలో 19వ గేటు కొట్టుకుపోవడంతో తుంగభద్ర డ్యామ్ నుంచి 45 టీఎంసీల నీరు కిందకు వృథాగా వెళ్లింది. మరింత నీరు దిగువకు పోకుండా యుద్ధప్రాతిపదికన రెండు ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోవడంలో సఫలమయ్యారు. తుంగభద్ర బోర్డు , కర్ణాటక, ఏపీ అధికారులు ఉమ్మడి కృషి ఫలితంగా డ్యామ్‌లోని నీటిని వృథాగా వెళ్లకుండా అడ్డుకున్నారు. డ్యాంల గేట్లు తయారీలో నైపుణ్యం ఉన్న సాగునీటి నిపుణులు కన్నయ్య నాయుడు ఈ బృందానికి నాయకత్వం వహించారు.