NTV Telugu Site icon

Tummala Nageswara Rao : గ్రామ పంచాయితీల విలీనంపై సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రి తుమ్మల లేఖ

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

భద్రాచలం విలీన గ్రామ పంచాయితీల పై చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల లేఖ రాశారు. ఇద్దరు సీఎం లు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆరో తేదీన భేటీ నేపథ్యంలో ఏపీ లో విలీనమైన ఎటపాక గుండాల పురుషోత్తమ పట్నం ..కన్నాయిగూడెం పిచుకుల పాడు గ్రామ పంచాయితీలను భద్రాచలం లో కలపాలని విన్నవించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ లో విలీనమైన ఏడు మండలాలు.. భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు ఏపీ లో విలీనం అయ్యాయని, .శ్రీ రాముడు కొలువైన రామాలయం తో టెంపుల్ టౌన్ గా భద్రాచలం ఉందన్నారు. భద్రాచలం పట్టణం శివారు నుంచి ఏపీ లో విలీన మవ్వడం తో డంపింగ్ యార్డుకు స్థలం లేదని, భద్రాచలం నుంచి చర్ల ప్రధాన రహదారి లో ఎటపాక ఆంధ్రాలో కలవడం తో అంతరాష్ట్ర సరిహద్దు సమస్యలు ఎదుర్కొంటున్నారని మంత్రి తుమ్మల అన్నారు.

 

భద్రాచలం నుంచి చర్ల వెళ్ళేవారు ప్రధాన రహదారి పై ప్రయాణం లో విలీన గ్రామాల వల్ల ఏపీ మీదుగా రాకపోకల్లో సాంకేతిక పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. .భద్రాచలం రామాలయం దేవస్థానం భూములు పురుషోత్తమ పట్నం గ్రామంలో ఉండటం తో భూములు పై ఆలయ అధికారులు పర్యవేక్షణ కు పాలనా పరమైన ఇబ్బందులు ఉన్నాయని, భద్రాచలం అనుకొని ఉన్న ఐదు గ్రామ పంచాయితీల వారు తెలంగాణ లో కలపాలంటూ పంచాయితీ తీర్మానాలు చేశారన్నారు. .ప్రజా విజ్ఞప్తులు దృష్టిలో పెట్టుకొని భౌగోళిక పరమైన విభజన తో ఇబ్బందులు పడుతున్న ఐదు గ్రామ పంచాయితీలను ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలనా సౌలభ్యం ప్రజా సంక్షేమం కోసం భద్రాచలం లో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రి తుమ్మల లేఖలో విజ్ఞప్తి చేశారు.