Site icon NTV Telugu

Tummala Nageswara Rao : సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. తిరుమల దర్శనం వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రులు భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కోరాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖలో పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు పూజించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు వసతి , దర్శనం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడి అధికారులు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో భేటీలో తిరుమల దర్శనంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల పై నిర్ణయం తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని లేఖలో కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

Exit mobile version