Tummala Nageswara Rao : ఖానాపురం హవేలీ నాల్గవ డివిజన్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ. 1.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (జి+1 భవనం) పనులకు సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, మంత్రి మాట్లాడుతూ, “ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతో అన్ని ప్రాంతాల ప్రజల అవసరాలను తీర్చేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ప్రజలకు సేవలందించేందుకు కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు. మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ, “నాల్గవ డివిజన్‌లో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాపన చాలా అవసరమైనది. ఈ ప్రాంతంలో గ్రానైట్ ఫ్యాక్టరీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు నివసిస్తున్నారు, వారికి ఈ ఆరోగ్య కేంద్రం ఎంతో ఉపయోగపడుతుంది” అని అన్నారు.
Ram Talluri : ‘వికటకవి’ చూసి నాకు గర్వంగా అనిపించింది
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్ పనులను కాంట్రాక్టర్ నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయడానికి పర్యవేక్షణ చేస్తాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ దండా జ్యోతి రెడ్డి, కార్పొరేటర్ కమర్తపు మురళీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బి. కళావతి బాయి, మునిసిపల్ ఇఇ లు కృష్ణాలాల్, రంజిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల జాతర వేదిక ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీజకు వినతి పత్రం సమర్పించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ, “తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యంగులకు రూ. 4,000 పెన్షన్లు రూ. 6,000కు పెంచుతామని చెప్పింది. కానీ ఇప్పటివరకు ఈ హామీ అమలు కాలేదు. వెంటనే పెన్షన్ రూ. 6,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం” అని చెప్పారు.
Adani Group: అదానీకి మరో ఎదురు దెబ్బ.. భారీ ప్రకటన చేసిన ఫ్రెంచ్ దిగ్గజం