ఇప్పుడు ఉన్నవాళ్లు అంత అప్పుడు బీఆర్ఎస్ నుండే గెలిచారన్నారు తుమ్మల నాగేశ్వర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను ఈరోజుకి కూడా ఒక్కసారి కూడా మేయర్ కి కూడా ఫోన్ చెయ్యలేదన్నారు. ఇలా అసభ్య భాషను ఎప్పుడు వాడలేదని, అవినీతి పరిపాలన, నీచమైన, దుర్మార్గమైన పాలన ఎప్పుడు చూడలేదన్నారు తుమ్మల. వాళ్ళు తట్టుకోలేక ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారన్నారు. డిప్యుటీ మేయర్ చాలా మంచి పని చేశారన్నారు తుమ్మల. ప్రజ అభిప్రాయం ఎట్ల ఉందొ మనం ఇప్పుడు చూస్తున్నామన్నారు తుమ్మల నాగేశ్వర రావు. ఈ పదిహేను రోజులు కష్టపడి పనిచేసి అరాచక పాలనను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని తుమ్మల చెప్పారు.
దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని అన్నారు. మన దేశంలో మత సామరస్యం దెబ్బతినేలా కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. విద్వేషాలకు తావు లేకుండా భారత్ జోడో యాత్రతో దేశాన్ని రాహుల్ గాంధీ ఏకం చేశారని కొనియాడారు. సోనియమ్మకు మహిళల కష్టాలు తెలుసని చెప్పారు. కర్ణాటక మాదిరి తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. అనంతరం కార్పొరేటర్ నాగల్ మీరా మాట్లాడుతూ.. నాకు మంత్రి అజయ్ కుమార్ ఫోన్ చేసి బెదిరించడం జరిగిందన్నారు. కేటీఆర్ గురించి మాట్లాడతావా… నీ సంగతి చూస్తా అంటూ బెదిరించిన మంత్రి అజయ్ కుమార్… మా మైనార్టీలు అంటే ఇంత చిన్నచూపా… నాకు ఏదైనా జరిగితే దానికి బాధ్యత మంత్రి అజయ్ కుమార్ దే… అని నాగల్ మీరా అన్నారు.