ఖమ్మం జిల్లా బీసీ నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఉద్దేశించి సీరియస్ గా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల కోసం పని చేయాల్సిన అధికారులు ఒక పక్షం ప్రయోజనాల కోసం నీతి నిజాయితీ లేకుండా పని చేయడం అనేది నీతి బాహ్యమైన చర్య అని మాజీ మంత్రి తుమ్మల ఆరోపించారు.
Read Also: McDonalds Controversy: మెక్‌డొనాల్డ్స్ నిర్ణయంతో కోపంగా ఉన్న అరబ్ దేశాలు
ఖమ్మం జిల్లాలో ఉన్న అధికారులు అందరూ కూడా తప్పుడు దారిలో ప్రయాణం చేస్తున్నారని ఇది పద్ధతి కాదని ఆయన సుతి మెత్తగా హెచ్చరించారు. ఇదే విధానంలో అధికారులు కొనసాగితే మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.. మీరు మారాల్సిన అవసరం ఉంటుందని అధికారులను ఉద్దేశించి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వార్నింగ్ ఇచ్చారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో కొంత మంది అధికారులు అధికార పార్టీ నేతలకి కొమ్ము కాస్తున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే తుమ్మల నాగేశ్వరావు చాలా సీరియస్ గా అధికారులను హెచ్చరించారు. అయితే, ఎప్పుడు అధికారులతో పని చేయించుకునే తుమ్మల నాగేశ్వరరావు ఆ అధికారుల పట్ల ఘాటుగా వ్యాఖ్యానించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్ దిగారు. అప్పుడు సేవ చేయించుకుని ఇప్పుడు వారిపై విమర్శలు చేస్తున్నారని గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.