ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపై అటు టీడీపీ, జనసేన, బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతలు కూడా విరుచుకుపడుతున్నారు. మంత్రి యర్రగొండపాలెంలో వ్యవహరించిన తీరుని మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి తప్పుబట్టారు. రోడ్డు మార్గాన కాకుండా వీర జవాన్లను వాయు మార్గాన తరలించేందుకు విమానాలు సమకూర్చి ఉంటే 2019లో పుల్వామా దుర్ఘటనలో 40 మంది జవాన్లు చనిపోయి ఉండేవారు కాదని చెప్పినందుకు నాటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ పై మోడీ ప్రభుత్వం కక్ష సాధించడం శోచనీయం అన్నారు డాక్టర్ ఎన్. తులసి రెడ్డి.
Read Also: Student Car Accident: కారుతో ఇంటర్ విద్యార్థి బీభత్సం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు
ఎన్నికల్లో లబ్ధి కోసం జవాన్ల ప్రాణాలను బలి పెట్టడం దుర్మార్గం. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ నేతలు దాడులు చేయడం గర్హనీయం. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ రోడ్డుమీద చొక్కా విప్పి వీధి రౌడీలా ప్రవర్తించడం సిగ్గుచేటు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే శాంతి భద్రతల సమస్యలను సృష్టించడం దురదృష్టకరం అన్నారు తులసిరెడ్డి. మంత్రి వర్గం నుండి మంత్రి ఆది మూలపు సురేష్ ను ముఖ్యమంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: RR vs RCB: బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీ