NTV Telugu Site icon

Tuhin Kanta Pandey: సెబీ చైర్‌పర్సన్‌గా తుహిన్ కాంతా పాండే నియామకం

Tuhin Kanta Pandey

Tuhin Kanta Pandey

Tuhin Kanta Pandey: ప్రస్తుతం ఆర్థిక, ఆదాయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్న తుహిన్ కాంతా పాండే.. రాబోయే మూడు సంవత్సరాల పదవీకాలానికి ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు అఫ్ ఇండియా (SEBI)’ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన పాండే, మాధబీ పురి బుచ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. బుచ్ పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగుస్తోంది.

Read Also: Astrology: ఫిబ్రవరి 28, శుక్రవారం దినఫలాలు

ఇటీవల జరిగిన పునర్వ్యవస్థీకరణలో, పాండే జనవరిలో ఆదాయ కార్యదర్శిగా నియమితులయ్యారు. అంతకు ముందు, ఆయన పెట్టుబడి అండ్ ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (DIPAM) కార్యదర్శిగా పనిచేశారు. DIPAM కార్యదర్శిగా పాండే ప్రముఖమైన ప్రైవేటీకరణ ప్రాజెక్టులైన ఎయిర్ ఇండియా విక్రయం, ఇంకా భారత జీవిత బీమా సంస్థ (LIC) లిస్టింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు.

Read Also: Prabhas-Mohanababu: మోహన్‌ బాబును ఆట పట్టించిన ప్రభాస్.. వీడియో వైరల్

పాండే నియామకం ద్వారా మాధబీ పురి బుచ్ పదవీకాల పొడిగింపు పొందే అవకాశాలు తగ్గిపోయాయని స్పష్టమైంది. గతంలో UK సిన్హా, అజయ్ త్యాగీ వంటి మాజీ సెబీ చైర్‌పర్సన్‌లు వరుసగా ఆరు, ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగినప్పటికీ, బుచ్‌కు అలాంటి పొడిగింపు లభించలేదు.