గ్రామాన్ని, గ్రామంలోని దుష్ట శక్తులను తరిమికొట్టెందుకు ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది.. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.. ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందేందుకు హనుమాన్ చాలీసా ను చదువుతూ ఉండాలి.. హనుమాన్ చాలీసా ప్రతి రోజూ చదవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని మంత్రాలలో అత్యంత శక్తివంతమైన హనుమాన్ చాలీసా పఠిస్తే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే సక్సెస్, డబ్బు ఎల్లప్పుడూ మీతో ఉండాలంటే మధ్యాహ్నం సమయంలో హనుమాన్ చాలీసా ను 11 సార్లు చదవడం మంచిదని పండితులు చెబుతున్నారు..
ఏదైనా భయానికి గురైనప్పుడు.. మరేదైనా బాధ కలిగితే దైర్యం కోసం హనుమాన్ చాలీసాను చదువుతారు..ఇక గ్రహాల ప్రభావం మనపై అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది.. ఈ చాలీసా ను 108 రోజులు 108 సార్లు పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే బ్రహ్మ ముహూర్త సమయంలో 40 రోజుల పాటు 31 సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే అనారోగ్య సమస్యలు మాయమవుతాయని చెబుతున్నారు… భయం పోయి మానసికంగా, దృఢంగా ఉండడం కోసం సూర్యాస్తమయం లో 11 సార్లు హనుమాన్ చాలీసా చదవడం మంచిది..
తీరని సమస్యలు ఉన్నప్పుడు, కోర్టు వ్యవహారులు ఉన్నప్పుడు ఈ చాలీసాను చదివితే సమస్యలు వెంటనే తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు.. అలాగే శత్రు పీడ తొలగిపోవాలంటే నిష్టగా 11 సార్లు రోజు హనుమాన్ చాలీసా ను చదవాలి.కోరుకున్న కెరీర్, జీవితంలో విజయం సాధించాలంటే జీవితాంతం రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది.. మీ జీవిత కాలంలో ఈ చాలీసాను నిర్దిష్ట సమయాలలో 21 వేల సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.. ఈ పూజ, చాలీసా గురించి ఆంజనేయ స్వామి ఆలయ పూజారిని అడిగి తెలుసుకోవడం మంచిది..
