NTV Telugu Site icon

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేడు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

Tirumala

Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీ‌వారి దర్శనానికి ఆగ‌స్టు నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్లు, వసతి గదులు ఆన్‌లైన కోటా రిలీజ్ కానున్నాయి. గురువారం (మే 23న) ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అదే రోజు (మే 23) ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆన్ లైన్ కోటాను రిలీజ్ చేశారు. నిన్న (మే 23)న మధ్యాహ్నం 3 గంటలకు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత‌ ప్రత్యేక దర్శన టోకెన్లు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది.

Read Also: SRH vs RR Qualifier 2: నేడు క్వాలిఫయర్‌-2.. ఫైనల్‌కు వెళ్లేదెవరో!

కాగా, ఇవాళ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది. అంతేకాదు నేటి (మే 24న) మధ్యాహ్నం 3 గంటలకు తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో ఉన్న వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయబోతుంది. తిరుమల, తిరుపతి శ్రీవారి సేవ కోటాను మే 27 (సోమవారం)న ఉదయం 11 గంటలకు, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ, మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ప‌ర‌కామ‌ణి సేవ ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. భక్తులు ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌ సేవ‌, దర్శన టికెట్లను బుక్ చేసుకునే అవకాశం టీటీడీ కల్పించింది. ఇక, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. కాగా, నిన్న శ్రీవారిని 65, 416 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 36, 128 మంది భక్తులు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండి ఆదాయం 3.51 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.