TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం టికెట్లతో పాటు.. వివిధ రకాల సేవా టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇవాళ్టి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ.. ఇక, ఇవాళ నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటలకు వరకు ఆర్జిత సేవలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. ఎల్లుండి మధ్యహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనున్నారు..
Read Also: RamaJogayya Sastry : ఒక్క రోజు ఓపిక పట్టండి అబ్బా..’అని’ అదరగొడతాడు..
ఇక, తిరుమల పద్మావతి పరిణయోత్సవాలు రెండోరోజుకు చేరుకున్నాయి.. ఇవాళ గరుడ వాహనంపై ఉరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్నారు శ్రీవారు.. ఈ నేపథ్యంలో.. ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి.. వెలుపల క్యూ లైనులో పెద్ద సంఖ్యల్లో వేచిఉన్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.. మరోవైపు.. నిన్న శ్రీవారిని 71,510 మంది భక్తులు దర్శించుకున్నారు.. 43,199 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా పేర్కొంది టీటీడీ.