NTV Telugu Site icon

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే దర్శన టికెట్లు విడుదల..

Ttd

Ttd

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్‌.. ఇవాళ్టి నుంచి శ్రీవారికి దర్శనానికి సంబంధించిన వివిధ టికెట్లను విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయబోతున్నారు.. అందులో భాగంగా ఈ రోజు.. లక్కీడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కేట్లు విడుదల చేయబోతున్నారు.. ఇక, ఈ నెల 21వ తేదీన వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానుండగా.. 22వ తేదీన వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, అంగప్రదక్షణ దర్శన టికెట్లు విడుదల కాబోతున్నాయి.. మరోవైపు, 24వ తేదీన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు.

Read Also: Pooja Hegde : టాలీవుడ్ నాకెంతో ప్రత్యేకం..

ఇక, రేపటి నుంచి మూడు రోజులు పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. మరోవైపు.. ఈ నెల 22వ తేదీన శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. కాగా, తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లకు ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది.. టికెట్లను విడుదల చేసిన కొన్ని గంటలు, కొన్ని నిమిషాల వ్యవధిలోనూ పూర్తి కోటా బుక్ అయిన సందర్భాలు లేకపోలేదు.